కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా తన కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి మరింత పాపులారిటీ దక్కించుకుంది. కలర్స్ స్వాతి తెలుగు అమ్మాయి అని అందరికీ తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే 2018లో కేరళకు చెందిన వికాస్ వాసు అనే పైలెట్ ను వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడింది. ఇకపోతే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన కలర్స్ స్వాతి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అడపా దడపా సినిమాలలో నటిస్తూ కెరియర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 ఇక భర్తతో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమె విడాకుల తీసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలు ఇలా వైరల్ అవ్వడానికి కూడా కారణం లేకపోలేదు. ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుండి తన భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేసింది దీనితో విడాకులు తీసుకోబోతున్న అన్న సందేహం అందరిలో కలిగింది. అయితే ఈ విషయం గురించి ఎన్నో రకాలుగా వార్తలు వస్తుండడంతో తాజాగా ఆమె ఖండించే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం ఈమె నటుడు నవీన్ చంద్ర తో కలిసి మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది . తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరపగా అందులో చిత్ర బృందం మీడియా ప్రతినిధులతో సమావేశమై వారు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక విలేఖరి విడాకుల ప్రస్తావన తీసుకురాగా... ఈ కార్యక్రమానికి ఈ ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ ప్రశ్నకు నేను సమాధానం అస్సలు చెప్పను అంటూ తెలివిగా సమాధానం చెప్పి దాటవేసింది కలర్స్ స్వాతి.

మరింత సమాచారం తెలుసుకోండి: