ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. భారీ అంచనాల నడుమ రేపు ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇక మునుపటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రామ్ చాలా కొత్తగా కనిపించాడు. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు టీజర్ డైలాగ్స్ గమనిస్తే రామ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేంజ్ అయింది అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది.

లుక్స్ మాత్రమే కాకుండా బాడీని సైతం చాలా వరకు మార్చేసాడు. ఇంతకుముందు సినిమాల్లో చాలా స్మార్ట్ గా కనిపించిన ఆయన ఈ సినిమాలో కండల వీరుడు లాగా కనిపించాడు. స్కంద కోసం రామ్ భారీగా బరువు పెరిగాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ  సినిమా కోసం రామ్ పెరిగిన బరువు ఎంతో మనం కూడా తెలుసుకుందాం. అయితే రామ్ స్కంద సినిమా కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 నుండి 14 కిలోల బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. 70 కిలోలలి అటు ఇటుగా ఉన్న ఈ యంగ్ హీరో 84 కిలోలకి

పెరిగినట్లుగా తెలుస్తోంది. దీనికోసం జిమ్ లో చాలా కష్టపడ్డాడు. అయితే తాజాగా జిమ్ములో తన వర్క్ అవుట్సో చేస్తూ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ అభిమానులు షాక్ అవుతున్నారు. రామ్ డెడికేషన్ కు హాండ్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇక గత సినిమాలతో నిరాశపరిచిన రామ్ ఈ సినిమాతో అయినా భారీ విషయాన్ని అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. దీంతో ప్రస్తుతం రామ్ కి సంబంధించినవి వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: