రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుండే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన పాటలను , ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వచ్చింది. ఇక ఈ మూవీ పాటలకు , ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 13 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 8.50 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 19.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 41 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్లు , ఓవర్ సీస్ లో 2.0 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగబోతోంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram