మోడలింగ్ రంగం ద్వారా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మనుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈమె 2017 వ సంవత్సరం మిస్ వరల్డ్ బహుమతిని అందుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా అక్షయ్ కుమార్ హీరోగా రూపొందున పృథ్వీరాజ్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాలు నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాతో ఈ నటి మాత్రం మంచి గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ప్రస్తుతం మనుషి చిల్లర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ఆపరేషన్ వాలెంటీన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మరి కొంత కాలం లోనే థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. 

ఇకపోతే ఈ నటి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని  అంతే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: