బాలకృష్ణ అనీల్ రావిపూడి ల కాంబినేషన్ లో అక్టోబర్ 19 దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కావలసిన ‘భగవంత్ కేసరి’ అనుకున్న డేట్ కు విడుదల అవ్వకపోవచ్చు అన్నవార్తలు వస్తున్నాయి. దీనికికారణం ప్రస్తుతం చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన నేపద్యంలో మారిన రాజాకీయ పరిస్థితులలో బాలకృష్ణ ప్రస్తుతం పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో బిజీగా ఉండటం అన్నకారణం వినిపిస్తోంది.



వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఇంచుమించు పూర్తి అయినప్పటికీ బాలకృష్ణ పాత్రకు సంబంధించి కేవలం 5 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు సజావుగా ఉంటే ఈపాటికే బాలయ్య తన షూటింగ్ పార్ట్ ను ఎప్పుడో పూర్తి చేసి ఉండేవాడని మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో బాలయ్య ఈసినిమా పెండింగ్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడో ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి కూడ చెప్పలేని స్థితిలో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.



దీనితో ఈమూవీ ప్రమోషన్ ను మొదలుపెట్టాల లేదా అన్న కన్ఫ్యూజన్  లో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్య అనీల్ రావిపూడి ల కాంబినేషన్ కావడంతో ఈమూవీ బిజినెస్ కూడ బాగా జరిగిన పరిస్థితులలో ఇప్పుడు ఈసినిమా దసరా రేస్ నుండి తప్పుకుంటే విడుదల చేయడానికి మరో మంచి డేట్ దొరకడం కష్టం అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి.



అయితే దర్శకుడు అనీల్ రావిపూడి మాత్రం ఏదోవిధంగా ఈమూవీని అనుకున్న డేట్ కు విడుదల చేస్తాము అని చెపుతున్న పరిస్థితులలో బాలయ్య పాత్రకు సంబంధించి ఆ పెండింగ్ సీన్స్ లేకుండానే కథలో చిన్నచిన్న మార్పులు చేసి అనుకున్న దసరా కు విడుదల చేసే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీలో కొందరు అభిప్రాయ పడుతున్నారు. దసరా రేస్ మిస్ అయితే ఇక ఈసినిమాను విడుదల చేయడానికి నవంబయర్ తప్ప డిసెంబర్ జనవరి నెలలు పూర్తిగా నిండి పోవడంతో దర్శకుడు అనీల్ రావిపూడి టెన్షన్ లో ఉన్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి..  











మరింత సమాచారం తెలుసుకోండి: