
ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కింది. అయితే ఆయన టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీయగా.. ఈ రికార్డును గుర్తు చేసేలా ఆయన బయోపిక్ కి 800 అనే టైటిల్ పెట్టారు. ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ ఆరవ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మేకర్స్ తో పాటు ముత్తయ్య మురళీధరన్ కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తెలుగు మీడియాతో మాట్లాడిన ముత్తయ్య మురళీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
800 సినిమాలో క్రికెట్ కేవలం 20 శాతమే ఉంటుంది. మిగిలిన 80% అంతా నా లైఫ్ జర్నీ గురించి ఉంటుంది. నా ప్రయాణం నేను సాధించిన ఘనతలు ఈ క్రమంలో ఈ కుటుంబం.. దేశం ఎదుర్కొన్న పరిస్థితులను చూపించాం. నా బాల్యంలో సెలెక్టరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు. ఇలాంటి అంశాలు అన్నీ కూడా మూవీలో ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. మీరు తెలుగు సినిమాలు చూస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. శ్రీలంకలో తెలుగు సినిమాలు రిలీజ్ కావు. తమిళ, హిందీ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ భాషలో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తాను అంటూ తెలిపాడు.
బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప లాంటి సినిమాలు హిందీలో కూడా రిలీజ్ చేయడంతో ఆ సినిమాలను చూశాను. ఇక తెలుగులో హీరో నాని అంటే ఎంతో ఇష్టమని.. ఆయన నటించిన ఎక్కువ సినిమాలు చూశానని చెప్పుకొచ్చాడు. నాని యాక్షన్ హీరో కాదు అతని సినిమాలలో డ్రామా ఎమోషన్లు కూడా ఉంటాయి. అతను ఒక న్యాచురల్ స్టార్ అంటూ మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఇలా ప్రపంచ స్థాయి క్రికెటర్ నుంచి నాని కి ప్రశంసలు దక్కడంతో అతని అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.