
బాలీవుడ్ సినీ లవర్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా యానిమల్. తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చేసింది. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ తో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అర్జున్ రెడ్డిని మించి 'యానిమల్' టీజర్ మరింత వైలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో సందీప్ రెడ్డి వంగ రీమేక్ చేయగా ఆ సినిమా చూసి బాలీవుడ్ విశ్లేషకులు ఇది మోస్ట్ వైలెంట్ ఫిలిం అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ..
'అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని' చెప్పాడు. చెప్పినట్టుగానే 'యానిమల్' టీజర్ ని వైలెన్స్ తో నింపేశాడు. ఈరోజు(సెప్టెంబర్ 28) రణబీర్ కపూర్ బర్త్ డే కావడంతో 'యానిమల్' టీజర్ ని విడుదల చేయగా, ఎవరూ ఊహించని విధంగా టీజర్ ఫస్ట్ ప్రైమ్ నుంచే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళింది. రష్మిక, రణబీర్ మధ్య డిస్కషన్ తో మొదలైన టీజర్ సెకండ్ షాట్ నుంచి వైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని టీజర్ తో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే రణబీర్ ని మూడు వేరియేషన్స్ లో ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్ లో రణబీర్ అర్జున్ రెడ్డిని మించి కనిపిస్తున్నాడు.
సూటు బూటు వేసుకొని వెనక తన మనుషులతో ఉన్న లుక్ లో స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లుంగీ, సల్వార్ లుక్ లోకి మారి ఊర మాస్ గా కనిపించాడు. టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపించకపోయినా దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రణ్ బీర్ కపూర్ పడిపోయినప్పుడు వచ్చిన షాట్ టీజర్ ఎండ్ లీక్ బాబి డియోల్ ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దాదాపు రెండు నిమిషాల 26 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా పై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్ళింది. కొన్నిచోట్ల రణబీర్ కూల్ గా కనిపిస్తే, మరికొన్ని చోట్ల చాలా వైలెంట్ గా కనిపించాడు.