
అంత టాలెంట్ ఉంది కాబట్టే ఈ తారకు తాజాగా ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. పెద్ద హీరోయిన్లకు కూడా దక్కని అవకాశం అది. వైష్ణవి చైతన్య "బేబీ" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాక చాలా సినిమా ఆఫర్స్ ఆమె చెంతకు చేరాయని సమాచారం. కాగా వాటిన్నిటిలో ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె దివంగత సహజనటి సౌందర్య బయోపిక్‌లో మెయిన్ లీడ్‌లో నటించే ఛాన్స్ పట్టేసినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వచ్చాయి. వైష్ణవి అచ్చ తెలుగు అమ్మాయి, చూడ్డానికి కూడా ఆమెది చక్కని రూపం. చక్కగా నటించగలదు. అందుకే ఇతర ముంబై హీరోయిన్ లను కాకుండా వైష్ణవి సౌందర్య బయోపిక్ మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
వైష్ణవి చైతన్య సౌందర్య పాత్రకు బాగా సరిపోతుందని మేకర్స్ ఖచ్చితంగా అనుకుంటున్నారట. సౌందర్య చాలా మంది అభిమానులకు ఇష్టమైన హీరోయిన్. ఆమె బయోపిక్ వస్తే రూ.100 కోట్లు క్రాస్ చేయడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల కావలసి ఉంది. ఒకవేళ ఈ బయోపిక్ నిజంగా తీస్తున్నట్లయితే అందులో వైష్ణవి చైతన్య సెలెక్ట్ అయితే అది ఆమె చేరిలో ఒక మైలురాయి అవుతుంది. సావిత్రి సినిమాతో కీర్తి సురేష్ ఎలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో అలా వైష్ణవి చైతన్య కూడా సౌందర్య బయోపిక్ తో ఎదుగుతుందని చెప్పవచ్చు.