చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రస్తుతం స్టోరీ బాగుంటే పాన్ ఇండియా లెవెల్లో పలు సినిమాలను విడుదల చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్ వుడ్ నటుడు శివరాజ్ కుమార్ ఎన్నో చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇటీవలే తను నటిస్తున్న ఘోస్ట్ అనే చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.



ఇప్పటికే ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి  ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యి మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో తాజాగా ట్రైలర్ ని ప్రముఖ దిగ్గజ ధీరుడు అయిన రాజమౌళి చేతుల మీదుగా అక్టోబర్ ఒకటవ తారీఖున ఉదయం 11 గంటలకు టి సిరీస్ యూట్యూబ్ చానల్స్ లో తెలుగు ఘోస్ట్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ఒక ట్విట్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ తర్వాత మళ్లీ అంతటి ఫేమస్ అయిన నటుడు శివరాజ్ కుమార్ అని చెప్పవచ్చు.

ఘోస్ట్ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ కథ అంశంతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్  లో ఉండడంతో అంచనాలను పెంచేస్తూ ఉన్నారు. గతంలో టీజర్ కూడా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నది. దసరా కానుకగా ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్ర బృందం. ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీని దర్శకత్వం వహించారు నిర్మాతగా ప్రముఖ రాజకీయ నాయకుడు సందేశ్ నాగరాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మరి రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడంతో తెలుగులో మరింత ప్లస్ కాబోతోందని చెప్పవచ్చు ఏ మేరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: