
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక , ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి అదనంగా మరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద 12 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఆరు కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 46 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. కానీ ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిన ఈ వీకెండ్ లోనే రాబట్టాలి, ఆ తర్వాత కనీసం చిల్లర రేంజ్ వసూళ్లు వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. లారెన్స్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే ఛాన్స్ ఉంది. ఒక క్లాసిక్ సినిమాకి సీక్వెల్ చేసి చెడగొట్టారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ లారెన్స్ పై విరుచుకుపడుతున్నారు.