యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత హీరో గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించాడు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో..అయితే ఆ తరువాత వచ్చిన స్పై మూవీతో ఆడియన్స్ను కాస్త డిసప్పాయింట్ చేశాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో పాటు చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఈ యంగ్ హీరో నుంచి వస్తోన్న..మరో క్రేజీ, పీరియాడిక్ మూవీ స్వయంభూ .ఈ సినిమా ఫస్ట్లుక్ లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి కత్తి సాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకర్స్ షేర్ చేశారు. వియాత్నంలోని సముద్ర తీరంలో ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియోకు..ప్రకృతి మాత ఆశీర్వాదానికి చిహ్నం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. నిఖిల్ కత్తిని తిప్పుతుండగా..సూపర్ డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నిఖిల్ స్వయంభూ సినిమా కోసం వియత్నాంలో నెలరోజులు స్పెషల్ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. అక్కడ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ మరియు గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు.


ఈ చిత్రంలో తను ఒక వారియర్ కనిపించడం కోసం ఫిజికల్‌గా కూడా మేకోవర్ అవుతున్నాడు హీరో నిఖిల్...నిఖిల్ నటిస్తున్న స్వయంభూ చిత్రం అతని కెరీర్ లో 20వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కేజిఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: