
ఈ సినిమా తెలంగాణ యాసతో పాటు కామెడీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండేటట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంత అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పలు రకాల పోస్టర్లలో బాలయ్యను చూస్తే ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా సాంగ్స్ పోస్టర్స్ మేకింగ్ వీడియోలు వరుసగా విడుదల చేస్తూ సినిమాకి హైప్ తీసుకువస్తున్నారు. థమన్ సంగీతాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక క్లిక్ అయితే మరింత క్రేజ్ పెరిగి అవకాశం ఉన్నది.
అక్టోబర్ 4వ తేదీన ఉయ్యాల ఉయ్యాల అనే పాటని విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా తెలియజేశారు చిత్ర బృందం. ఇందులో నందమూరి బాలకృష్ణ పక్కన ఒక చిన్నారి కూర్చున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. గతంలో కూడా బాలయ్య నటించిన అఖండ సినిమాలో కూడా చిన్న పాప సెంటిమెంటుతో మంచి విజయాన్ని అందుకున్నారు. rrr సినిమాలో కూడా బ్రిటిష్ వాళ్ళు చిన్న పాపను తీసుకువెళ్లారని కాన్సెప్ట్ తోనే తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబి సార సినిమా కూడా చిన్న పాపతోనే ఈ సినిమా కాన్సెప్ట్ మొదలయ్యింది. ఇలా నందమూరి హీరోలంతా చిన్నారి పాప సెంటిమెంట్ తోనే సినిమాలను సక్సెస్ చేసుకున్నారు మరి బాలయ్య కూడా ఈసారి ఇదే సెంటిమెంట్తో మళ్ళీ సక్సెస్ అవుతారేమో చూడాలి.