ఈమధ్యకాలంలో హైపర్ ఆది ఏదైనా ఫిలిమ్ ఫంక్షన్ లో మైక్ పుచ్చుకుంటే చాలు ఏదో ఒక సంచలనాలు చేస్తూనే ఉన్నాడు. ఈనేపధ్యంలో ఈమధ్యనే జరిగిన ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రీ రిలీజ్  ఫంక్షన్ లో హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇండస్ట్రి వర్గాలలో హాట్ టాపిక్  గా మారాయి. ఈ సినిమా హీరో కిరణ్  అబ్బ వరం గురించి కాకుండా స్టార్  హీరో వారసులు వాళ్ళ నుంచి నేర్చుకోవలసిన గొప్ప విషయాల గురించి ఏకంగా పావు గంట సేపు మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.  



తారక్ చరణ్ బన్నీ మహేష్ బాబు ప్రభాస్ దాక ఎవరినీ వదలకుండా అందరనీ తన స్పీచ్ లో కవర్ చేస్తూ వారి పై మితిమీరిన పొగడ్తలు కురిపించాడు. దీనితో హైపర్ ఆది అలా మాట్లాడ్డం వెనుక గల కారణాలు  ఏమిటి అంటూ ఇండస్ట్రి వర్గాలలో  ఆసక్తికర చర్చలు జరిగుతున్నాయి.   లేటెస్ట్ గా అతడు మాట్లాడిన స్పీచ్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టాప్ హీరోల  అభిమానులు అంతా ఎవరికి వారు తమ హీరోల తాలూకు స్పీచ్  బిట్స్ ను కట్ చేసుకుని ఎంజాయ్ చేయడమే కాకుండా హైపర్ ఆది పై  ప్రశంసలు కురిపిస్తున్నరు.  

 

‘రూల్స్ రంజన్’ మూవీ ఫంక్షన్ కు ప్రత్యేకంగా అతిధులు రాకపోవడంతో హైపర్ ఆది స్పీచ్  మాత్రమే హైలెట్ గా మారింది. వాస్తవానికి ఈమూవీ నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడు కావడంతో పవన్ ను అతిధిగా తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.  



అయితే పవన్ కు అక్టోబర్ 1 నుంచి వారాహి యాత్ర ఉండటంతో పవర్ స్టార్ ఈ ఫంక్షన్ కు రాలేక  పొయ్యాడు అని వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ రాని లోటును హైపర్ ఆది తన  స్పీచ్ తో  తీర్చాడు అనుకోవాలి. ఏది ఎలా ఉన్నా హైపర్ ఆది స్పీచ్ లో చాల వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: