యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో మొదటగా ఆది అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కి నటుడిగా గొప్ప క్రేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు యాక్షన్ సన్నివేశాలలో చేసిన పర్ఫామెన్స్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఇక ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఓ మాస్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఎన్టీఆర్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో సాంబ అనే మూవీ రూపొందింది. 

భారీ అంచనాల నడుమ విడుదల అయిన సాంబ సినిమా మాత్రం ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సాంబ మూవీ కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఇకపోతే వీరి కాంబినేషన్ లో మూడవ మూవీ గా అదుర్స్ సినిమా రూపొందింది. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా కాకుండా కాస్త కామెడీ ఎంటర్టైనర్ గా వినాయక్ చిత్రీకరించాడు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించగా ... నయన తార , షీలామూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా 2010 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీ లో కామెడీ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి.

ఇప్పటికి కూడా ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఇంతలా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 23 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో నవంబర్ 18 వ తేదీన వరల్డ్ వైడ్ గా అదుర్స్ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: