పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తాజాగా "బ్రో" అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించినటు వంటి సముద్ర ఖనిరీమేక్ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో సాయి తేజ్ కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కేతికా శర్మ నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించలేకపోయిన ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెరపై సందడి చేయబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ లలో ... "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఎ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: