
అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చిన్న అనే టైటిల్ తో తెరకెక్కిన మూవీ.. ఇక డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి నేను చాలా కష్టపడతాను.
వాస్తవానికి ఆ కష్టాన్ని కూడా లెక్కచేయను. అయితే నా సినిమా తమిళంలో ఉదయనిది స్టాలిన్ గారి అబ్బాయి రైట్స్ తీసుకున్నారు. కనడంలో కేజిఎఫ్ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. కేరళలో ఒక టాప్ బ్యానర్ రిలీజ్ చేయబోతుంది. అయితే మొదట తెలుగులో నా సినిమాని రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో సునీల్, జాన్వి నారాయణ నన్ను నమ్మి సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా సెప్టెంబర్ 28న నా సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. బహుశా అందుకే ఎవరు సాహసించి ఉండరు. ఎందుకంటే ఆ రోజున సలార్ రిలీజ్ డేట్ ఉంది. ఇక ప్రభాస్కు నేను అభిమానిని. అయినా సరే అదే రోజున సినిమా రిలీజ్ కావాలనుకున్నాను. నేనైతే ముందుగా ప్రభాస్ సినిమా చూస్తాను. తర్వాత నా సినిమా చూడడానికి వెళ్తాను అంటూ సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. నా సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ తెలిపాడు.