ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగినటువంటి మహేష్ బాబు , అల్లు అర్జున్ , దుల్కర్ సల్మాన్ , అంజలి లకు సంబంధించిన మూవీ ల చిత్రీకరణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాల్లో నటిస్తున్నారు. వాటికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ అన్నపూర్ణ స్టూడియోలో మిర్చి యార్డ్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లో ఈ సినిమాకు సంబంధించిన నైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మహానటి , సీత రామం విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు తెలుగు దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ హైదరాబాదులో దుల్కర్ సల్మాన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అంజలి ప్రస్తుతం గీతాంజలి 2 లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: