సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే , శ్రీ లీల ను హీరోయిన్ లుగా తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ లో పూజ హెగ్డే ను తీసేసి ఆ స్థానంలో మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఇక ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

అలాగే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులే ఉన్నప్పటికీ ఈ మూవీ మేకర్స్ ఇప్పటి నుండే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఏరియాల బిజినెస్ ను క్లోజ్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నైజాం థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళ్తే ... తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి కూడా దిల్ రాజు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: