

సుశీల మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందిస్తున్నారు. నాగార్జున తన సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో ఇంత గొప్ప ఫ్యామిలీగా తన కుటుంబానికి ఒక గుర్తింపును అందించిన ఆయన తన నలుగురి పిల్లలకి సినిమా ఇండస్ట్రీలో ఒక స్థానాన్ని కల్పించారు కానీ ఈమెకు మాత్రం ఎటువంటి స్థానాన్ని కల్పించలేదు. అందుకే ఈమె గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఈమె పేరు నాగ సరోజ అయితే నాగ సుశీలగా కొంతమందికి మాత్రమే ఈమె పరిచయం. అందుకే ఈమె మరణం కూడా ఎవరికి తెలియలేదని చెప్పాలి. ఏది ఏమైనా నాగ సుశీల మరణం ఇప్పుడు అక్కినేని అభిమానులకే కాదు సినీ ఇండస్ట్రీకి విషాదఛాయలను మిగిల్చిందని చెప్పవచ్చు