ఇప్పటికే చాలా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్ గాని జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ప్రముఖ నటుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిలిం మేకర్స్ బొమ్మాలి రవిశంకర్ కుమారుడు అద్వయ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు. గతంలో గుణ 369 సినిమా అని తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ జి మూవీ మేకర్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ దసరా రోజున రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్ల డివోషనల్ ఎలిమెంట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయని కనిపిస్తోంది.


సుబ్రహ్మణ్య టైటిల్ తో ఆ ఆలయం అతని వాహనం నెమలిని చూపడం చూస్తే ఈ పోస్టర్లో అద్వయ్  చాలా డైనమిక్ గా కనిపిస్తూ ఉన్నారని చెప్పవచ్చు.. కాకి దుస్తులను ధరించి ఒక చేతిలో కాగడ మరొక చేతిలో రహస్యంగా కనిపించే ఒక పుస్తకంతో ఈయన కనిపిస్తున్నారు.. ఈ సినిమా కథకు హై అండ్ VFX డిమాండ్ భారీగా ఉందని సినిమా బిగ్ స్క్రీన్ ల పైన చూడడం ఒక కనుల పండుగగా ఉంటుందని మేకర్స్ సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లుగా పనిచేయడం జరుగుతోంది.KGF, సలార్ చిత్రాలకు పనిచేసిన వారిని ఈ సినిమాకి పనిచేస్తున్నట్లు సమాచారం.


ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో కన్నడ తమిళ్ మలయాళం తెలుగు హిందీ వంటి భాషలలో విడుదల చేయబోతున్నారు అయితే సాయి కుమార్ తర్వాత ఆయన సోదరులు అయ్యప్ప శర్మ రవిశంకర్ నటులుగా సక్సెస్ కాలేకపోయారు.. సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ వరుసగా సినిమాలు చేస్తున్న సక్సెస్ అందుకోలేక పోతున్నారు. కానీ అవకాశాలు మాత్రం మెండుగానే లభిస్తున్నాయి. మరి రవిశంకర్ కుమారుడు అద్వయ్ హీరోగా ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఈ గ్లింప్స్ మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: