సాంకేతికత అభివృద్ధి చెందటంతో ఎన్ని ప్రయోజనాలు  కనిపిస్తున్నాయో అన్ని  దుష్ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మార్ఫింగ్ టెక్నాలజీ చాలమందికి  అందుబాటులోకి రావడంతో ఈమధ్య రష్మిక మందన ఫేస్ ని తీసుకుని ఇంకో మోడల్ కి అతికించి అసభ్యంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడంతో అది  సృష్టించిన  కలవరం అందరికీ  తెలిసిందే.  



ఇలాంటి వ్యవహారాల పై లీగల్ చర్యలు తీసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నప్పటికీ  అనేకమంది తప్పించుకుని తిరుగుతూ  ఉండటంతో ఇలాంటి వ్యవహారల పై ఎలాంటి అదుపు నియంత్రణ  ఉండటంలేడు. ఇది చాలా దుర్మార్గమని స్వయంగా అమితాబ్ బచ్చన్ లాంటి టాప్ సెలిబ్రిటీ పిలుపు ఇవ్వడం పరిశీలించిన వారికి పరిస్థితి ఎంత విషమంగా మారిందో అర్థం అవుతుంది.  



ఆమధ్య సమంతా సాయిపల్లవి కాజల్ అగర్వాల్ లు కూడ ఇలాంటి వీడియోలకు మార్ఫింగ్ బారిన పడటం సంచలనంగా మారిన విషయం  తెలిసిందే. లేటెస్ట్ గా ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపుతున్న ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో సినిమా హీరోలకు హీరోయిన్స్ కు  కొన్ని  ఊహించని సమస్యలు వస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కొందరు ‘గుంటూరు కారం’ ‘స్పిరిట్’ పోస్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో తయారుచేయించారు అన్నవార్తలు  విని కొందరు షాక్ అవుతున్నారు.  



ఆ పోస్టర్లు నిజమే అనుకుని హీరోల అభిమానులు తమ ఊళ్ళలో ఫ్లెక్సిలు చేయించి హడావిడి చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇంకా హై ఎండ్ టూల్స్ వాడితే మన ఇంట్లో పెళ్లికి మహేష్ బాబు వచ్చినట్లు బర్త్ డేకి పవన్ కళ్యాణ్ హాజరైనట్లు గ్రాఫిక్స్ సృష్టించే ఆస్కారం ఉంది. దీనితో ఈ సున్నిత సమస్యను ఎలా కట్టడి చేయాలో తెలియక ఫిలిమ్ సెలెబ్రెటీలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి విషయాల పై చర్యలు తీసుకోవడానికి చట్టాలను కఠిన తరం చేయమని సెలెబ్రెటీల నుండి డిమాండ్ పెరుగుతోంది. అయితే ఎన్ని చట్టాలు చేసినా ప్రజలలో మార్పు రానంత వరకు ఇలాంటి కొత్త సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి..





మరింత సమాచారం తెలుసుకోండి: