తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటనలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తన కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన ఎన్నో సినిమాలలో నటించాడు. ఇకపోతే వెంకటేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఈ మూవీ కి కే విజయభాస్కర్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను మరియు డైలాగ్ లను అందించాడు. ఆర్తి అగర్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ , సునీల్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా ... శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే కోటి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ 2001 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్టు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సంవత్సరం డిసెంబర్ 13 వ తేదీన వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను భారీ ఎత్తున థియేటర్ లలో మళ్ళీ రీ రిలీస్ చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో ఒకటి రెండు రోజుల్లో ఈ మూవీ బృందం ప్రకటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం వెంకటేష్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: