పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఓ జి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ సినిమాల షూటింగ్లో జరుగుతున్నరు. అయితే ఈ సినిమాల షూటింగ్ జరుగుతుంది అని ఒక క్లారిటీ అయితే ఉంది కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప ఈ సినిమాపై ఒక క్లారిటీ మాత్రం లేదు. అయితే హరిహర వీర సినిమా షూటింగ్ ఆగిపోయి చాలా రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా

ప్రస్తుతం బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని అన్నారు. దీని తర్వాత మొదలైన సినిమాల షూటింగ్ లు ప్రస్తుతం  జరుగుతున్న విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఒకటి కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ క్రమంలోని అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్న విషయంపై ఎవ్వరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది అన్న వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. అయితే ఇప్పుడు ఇది

 నిజమే అని క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ బాబీడియోల్ నటిస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న యానిమల్ సినిమాలోను విలన్‌గా నటించాడు బాబీ డియోల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌ ఈవెంట్‌కు వచ్చిన బాబీ డియోల్.. హరిహర వీరమల్లు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఓ తెలుగు సినిమా ఒప్పుకున్నాను కానీ సగం షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఆగిపోయిందని తెలిపాడు. దీంతో విలన్ చెప్పేశాడు కాబట్టి… హరిహర వీరమల్లు దాదాపుగా ఆగిపోయినట్టేనని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ సినిమాకి సంబంధించిన క్లారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: