వక్కంతం వంశీ దర్శకత్వంలోలవర్ బాయ్ నితిన్, యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్''. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో  రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్జ్ టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంటోంది.

జీవితంలో హీరోగా ఎదగాలనుకునే ఓ కుర్రాడు, చిన్నతనం నుంచి తనలా కాకుండా ప్రతిరోజు డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటాడు. అలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా మారుతాడు. అది నచ్చని నాన్న ఎంత తిట్టినా పట్టించుకోకుండా సినిమాల్లో చివరన ఉండే క్యారెక్టర్స్ లో నటిస్తూ ఉంటాడు. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వమని మైసమ్మను అడగడంతో హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. దాంతో హీరో తనకు సంబంధం లేని గొడవలో ఇరుక్కుంటాడు. ఆ గొడవను కూడా డిఫరెంట్ గా ఫీల్ అయి విలన్ తో ఫైటింగ్ కి దిగుతాడు.

అసలు హీరో ఆ గొడవలో ఇరుక్కోడానికి కారణం ఏంటి? విలన్ హీరోతో ఎందుకు ఫైటింగ్ కి దిగుతాడు? చివరికి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ హీరో అయ్యాడా? లేక ఆర్డినరీ మ్యాన్ గానే ఉండిపోయాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీని చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. కొన్ని సోషల్ మీడియా పాపులర్ డైలాగ్స్ ని కూడా ఇందులో వాడేసారు. ఇక ట్రైలర్ చివర్లో రాజశేఖర్ ఎంట్రీ అయితే మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ అందుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: