ఇటీవల కాలంలో కన్నడ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, హిందీ సహా మరికొన్ని భాషల్లో  ఎవరు ఊహించని విధంగా  బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  కేజిఎఫ్ తర్వాత ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతోంది. 'కాంతార- ఏ లెజెండ్ చాప్టర్ 1' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా   రిలీజ్ చేశారు. 

ఈ ఫస్ట్ లుక్ లో రిషబ్ శెట్టి లుక్, గెటప్ అందర్నీ షాక్ కి గురి చేసింది. దానికి తోడూ బీజీయం గూస్ బంప్స్ తెప్పించింది. కండలు తిరిగిన దేహంతో, శరీరం పై రక్తపు మరకలు, మెడలో రుద్రాక్షలు, చేతిలో త్రిశూలం, పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో చిన్నపాటి అఘోరా లాగా టీజర్ లో కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు రిషబ్ శెట్టి. కదంబల జన్మించిన ఓ లెజెండ్ కథ ఇది అంటూ ఫస్ట్ లుక్ టీజర్ లో మేకర్స్ పేర్కొన్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది.

 కాంతార మూవీ లో రిషబ్ శెట్టి తండ్రి, కొడుకులు గా డ్యూయల్ రోల్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో రిషబ్ శెట్టి గెటప్ తండ్రి పాత్రకు సంబంధించింది అయ్యుంటుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ తో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ పతాకం పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: