ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. మొదట వెబ్ సిరీస్ లలో చిన్న స్థాయి నటి నటులు ... అలాగే పెద్దగా క్రేజీ లేని నటులు నటిస్తూ ఉండేవారు. కానీ వాటి రేంజ్ పెరుగుతూ వచ్చింది. దానితో స్టార్ హీరోలు ... స్టార్ హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా కొంత మంది కొత్త వాళ్లకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉండడంతో క్రేజ్ ఉన్న వాళ్ళు కూడా వెబ్ సీరీస్ లలో నటించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

ఇక అందులో భాగంగా ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఇద్దరు నటీమణుల కాంబోలో ఓ క్రేజీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు , తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న కీర్తి సురేష్ ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రేట్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్ తో పాటు రాధిక ఆప్టే కూడా నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కు ధర్మరాజు శెట్టి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే నిజం గానే ఈ ఇద్దరు క్రేజీ నటీమణులు ఒకే వెబ్ సిరీస్ లో కలిసి నటించినట్లు అయితే ఆ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కీర్తి సురేష్ తో పాటు రాధిక ఆప్టే కూడా అనేక తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇలా ఈ ఇద్దరు ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: