
అయితే పూజా గాంధీ స్వస్థలం మాత్రం ఉత్తర ప్రదేశ్.. సినిమాల మీద మక్కువ ఉండడంతో ఇమే కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందట. ఆ తర్వాత పూజా గాంధీ రాజకీయ రంగంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పూజా గాంధీకి కన్నడ నేర్పించింది కూడా విజయ్ నేట.అలా ఇద్దరి కూడా ప్రేమించుకొని నిన్నటి రోజున వైవాహిక బంధంతో ఒక్కటిగా నిలిచారట. 2012 లో పూజా గాంధీ ఎంగేజ్మెంట్ ఒక వ్యాపారవేత్త అయిన ఆనంద్ గౌడ తో జరిగింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ అప్పట్లోనే విడిపోయారట.
మళ్లీ ఇప్పుడు విజయ్ తో కలిసి పెళ్లి పీటలెక్కింది ఈ ముద్దుగుమ్మ.. పునీత్ రాజు వంటి హీరోలతో కూడా పలు సినిమాలలో నటించింది పూజా గాంధీ.. కన్నడ తో పాటు తమిళ్ బెంగాలీ తెలుగు హిందీ వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటించింది. దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది. పూజా గాంధీ ఇందులో మూడు భాగాలలో తెరకెక్కించిన ఈ మూడు భాగాలలో బోల్డ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించింది. ఇక ఈమె భర్త విషయానికి వస్తే బెంగళూరులో సొంత లాజిస్టిక్ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్న ఈ జంట అభిమానుల సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.