నాచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ సౌర్యు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం హాయ్ నాన్న.. ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నాని ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మరొకసారి తన హవా చూపించాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్తో తెరకెక్కించడంతో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు.


సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్ గా ఉన్న చిత్ర బృందం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం కూడా చాలా ధీమాతో తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా హాయ్  నాన్న సినిమా దాదాపుగా 30 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తున్నది. దసరా తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన నాని సినిమాగా చెప్పడం గమనార్హం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే కచ్చితంగా 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. సినిమా హిట్ టాక్ వస్తే కచ్చితంగా వారంలోని కొన్ని కోట్ల రూపాయలు సాధించగలరు సినిమా అని నాని అభిమానులు తెలుపుతున్నారు.

మరి ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు ఓపెనింగ్స్ ఏ విధంగా రాబట్టుతుందో చూడాలి మరి. ముఖ్యంగా చాలా సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇందులో వాటన్నిటిని మించి నాని తన సినిమాతో ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి మరి. హాయ్ నాన్న సినిమా ఇటీవల సెన్సార్ కూడా క్లీన్ యు సర్టిఫికెట్ ని ఇవ్వడం జరిగింది. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే..155 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో శృతిహాసన్ కూడా ఒక కీలకమైన పాత్రలు నటించినట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: