బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ YRF స్పై యూనివర్స్ భాగంలో తెరకెక్కిస్తున్న సినిమా వార్‌ 2. గతంలో హృతిక్‌ రోషన్, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో వచ్చిన వార్‌ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ జాయిన్ కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవలే వార్‌ 2 సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో నిర్వహించినట్టు అప్‌డేట్ కూడా వచ్చింది. ఇంకా ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే దానిపై క్లారిటీని ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిజానికి కాస్త ముందుగానే రిలీజ్ కావాల్సింది ఈ సినిమా. కానీ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకొని వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే YRF Spy Universeలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు కావడం విశేషం.


ఇప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటి బాక్సాఫీస్‌ వద్ద మోత మోగించాయి.కానీ టైగర్‌ 3 మాత్రం భారీ నష్టాలని తెచ్చేలా ఉంది.1000 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా కనీసం 500 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.ఎండింగ్‌లో వార్‌ 2 గ్లింప్స్‌ కూడా ప్లే చేసినా కానీ ఉపయోగం లేదు.అందుకే వార్ 2 విషయంలో లేట్ అయినా కూడా చాలా జాగ్రత్తగా తీయాలనీ చూస్తున్నారు.పైగా అయాన్‌ ముఖర్జీ మరోవైపు బ్రహ్మాస్త్ర ప్రాంఛైజీ పనులపై కూడా ఫోకస్‌ పెట్టాడని తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడని తెలిసిందే.సో అది కూడా వార్ 2 లేట్ అవ్వడానికి కారణం. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ మలయాళ యాక్టర్‌ షైన్ టామ్‌ చాకో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మల్టీ లింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న దేవర సినిమా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: