
అలా ఇటీవల షారుఖ్ ఖాన్ తమిళనాడు డైరెక్టర్ అట్లీతో కలిసి జవాన్ సినిమానలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీ వారు కలిసిమెలిసి ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ భారీ పేర్లను సంపాదించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న అట్లే షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో తనని రియల్ రోల్ లో మెప్పించేలా చేశారు.అలాగే విజయ్ సేతుపతిని విలన్ గా చూపించారు. నయనతారని హీరోయిన్గా నటింపజేసేలా చేశారు. దాదాపుగా ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.
తాజాగా ఇప్పుడు ఒక మల్టీ స్టార్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది అట్లీ.. దళపతి విజయ్, షారుక్ ఖాన్ తో కలిసి ఒక మల్టీ స్టార్ సినిమాని చేయబోతున్నట్లు తెలిపారు. అట్లీ మాట్లాడుతూ జవాన్ సినిమా షూటింగ్ చెన్నైలో జరిగిందని అక్కడ విజయ్ కూడా రావడం జరిగిందని షారుక్ విజయ్ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత షారుక్ మా ఇద్దరిని పెట్టి ఏదైనా సినిమా చెప్పమంటూ తెలిపారని తెలిపారు. విజయ్ కూడా అందుకు అంగీకారమే అని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరికీ తగ్గట్టుగా కథని రాస్తున్నానట్టు తెలియజేశారు అట్లి. బహుశా నెక్స్ట్ సినిమా అదే ఉండవచ్చని సమాచారం.