పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.గత కొన్నేళ్ళ క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా ఇప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఇతర సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల రాజకీయ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది.

ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నిర్మాతలకు సైతం ఆర్థికంగా నష్టాలను కలిగించాయంటూ ఇటీవలే నిర్మాత AM .రత్నం ఒక తమిళ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ సినిమా కారణంగా తాను కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకులు అంచనాలను భారీగా క్రియేట్ చేశాయి.ఆ తర్వాత ఈ సినిమా వరుసగా షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో  ఒక్కసారిగా ఈ సినిమా షూటి ఆగిపోవడం జరిగింది. దీంతో ఈ సినిమా నిర్మాతలకు డైరెక్టర్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో OG సినిమా షూటింగ్ మాత్రమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఇందులో బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తూ ఉన్నారు.పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఏదో ఒక సినిమాని వచ్చే ఏడాదిలోపు విడుదల చేయాలని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: