తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న శ్రీకాంత్ తాజాగా "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో హీరో గా నటించడం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రాహుల్ విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ , శివాని రాజశేఖర్ , మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించగా తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ , విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకి రంజిన్ రాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడవ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఏడు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.26 కోట్లు ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.78 కోట్ల కలక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.04 కోట్ల షేర్ ... 6.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.

ఇకపోతే ఈ మూవీ కి 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 59లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.63 కోట్ల షేర్ ... 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: