రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 70.61 శాతం పోలింగ్‌ జరిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో పోలింగ్ ఎన్నడూ లేని విధంగాకేవలం 31 శాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో ఉన్న మిగతా ఏరియాలతో పోల్చుకుంటే హైదరాబాదులో తక్కువ శాతం ఓటింగ్ నమోదు అవ్వడం గమనార్హం. సెలబ్రిటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తుచేసినా, అంతకుముందు ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాదద్ నగర వాసులు మాత్రం

 ఓటు వేసేందుకు బయటకు రానేలేదు. ఇక అదే సమయంలో 'యానిమల్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం 80 శాతానికి చేరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంటే సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ సామాజిక బాధ్యతపై లేదని సోషల్ మీడియాలో హైదరాబాదీలను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాద్ పోలింగ్ 31శాతం అయితే యానిమల్ సినిమా బుకింగ్స్ మాత్రం 80 శాతం ఉన్నాయంటూ మీమర్స్ రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన మీమ్ 

వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పేరుకే హిందీ సినిమా కానీ నార్త్ కంటే తెలుగు రాష్ట్రాల్లోనే మూవీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక హైదరాబాదులో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 3 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. సుమారు 555 షోలకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే 400 షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. దీన్నిబట్టి భాగ్యనగరంలో యానిమల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది. అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: