భారతీయ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ల కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది దివంగత నటి సిల్క్ స్మిత.. ఈమె పేరు అప్పటికి ఇప్పటికీ పాపులారిటీ గానే మిగిలిపోయింది. తెలుగు తమిళ్ కన్నడ హిందీ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది.. అతి తక్కువ సమయంలోనే 400కు పైగా సినిమాలలో నటించింది. ఎక్కువగా సిల్క్ స్మిత వ్యాంపు పాత్రలలో స్పెషల్ సాంగుల లోనే నటించింది. ఒకే ఏడాది ఎక్కువ సినిమాలలో నటించి పలు రికార్డులను సైతం సృష్టించింది.

1979 నుంచి దాదాపుగా 20 ఏళ్ల పాటు కొనసాగించిందని చెప్పవచ్చు.. ఈ రోజున సిల్క్ స్మిత 63వ జయంతి సందర్భంగా.. సిల్క్ స్మిత బయోపిక్ గురించి అధికారికంగా ఒక ప్రకటన రావడం జరిగింది. సిల్క్ స్మిత బయోపిక్ లో నటి చంద్రిక రవి నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈమె గతంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పుడు సిల్క్ స్మిత పాత్రలో చంద్రిక నటించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి అన్ టోల్డ్ స్టోరీ అని క్యాప్షన్ కూడా జతచేస్తూ సిల్క్ స్మిత చంద్రికగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ జయరామ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియాలెవెల్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం. అన్ని ఇండస్ట్రీలో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత తన 35 ఏళ్ల వయసులో 1996లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సిల్క్ స్మిత మరణించేటప్పుడు ఒక లెటర్ రాసి మరణించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పటికి సిల్క్ స్మిత ఆత్మహత్య ఒక మిస్టరీ గాని మిగిలిపోయింది. గతంలో విద్యాబాలన్ డర్టీ పిక్చర్ పేరుతో ఆమె బయోపిక్ గా నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: