బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఖాతాలో మరో హిట్ పడింది. చాలా కాలం తర్వాత యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని  సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు తన సినిమాలు అత్యధిక ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా ఈ యానిమల్ సినిమా నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా 100 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. కబీర్ సింగ్ తర్వాత యానిమల్ సినిమాతో మరొకసారి తన మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది.

 అయితే తెలుగులో సైతం ఒక బాలీవుడ్ హీరో ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చారు అంటే ఇదే మొదటిసారి అని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడు డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. అయితే ఇందులో రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ కనిపించగా విలన్ పాత్రలో బాబి డియోల్ కనిపించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా కనిపించింది.

అయితే ఇందులో లిప్ లాక్స్ బోర్డ్ సన్నివేశాలు చాలా ఓవర్గా ఉన్నాయి అంటున్నారు ఆడియన్స్. కానీ ఇప్పుడు రష్మిక కంటే ఎక్కువగా ఒక బ్యూటీ కనిపించింది. యానిమల్ లో రణబీర్ కపూర్ తో బోల్డ్ సీన్లలో నటించిన హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో ఈ బ్యూటీ ఎక్కువగా బోల్డ్ సీన్లలో కనిపించింది. దీంతో ఈ హీరోయిన్ ఎవరని నెటిజన్స్ వెతుకున్నారు. త్రిప్తి డిమ్రీ.. బాలీవుడ్ బ్యూటీ. మోడలింగ్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై పలు యాడ్స్ చేసింది. సంతూర్ సోప్ యాడ్ లో నటించింది. 2017లో శ్రీదేవి మామ్ అనే సినిమా లో  ఓ కీలకపాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతోపాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా కనిపించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: