
గతంలోనే ఒకసారి ఎలిమినేట్ అయినట్టు హౌస్ నుంచి బయటికి వచ్చి సీక్రెట్ రూమ్ లో ఉండి మళ్లీ అశ్వత్థామ 2.0 అంటూ బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన గౌతం.. ఇక తన ఆట తీరుతో మాత్రం ప్రేక్షకులను మెప్పించాడు అని చెప్పాలి. కానీ మిగతా కంటెస్టెంట్లతో పోల్చి చూస్తే అతనికి ఓట్లు తక్కువగా రావడంతో చివరికి ఎలిమినేట్ కావలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ బజ్ అనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటారు. గౌతమ్ కూడా ఎలిమినేట్ అవ్వగానే ఈ షో లోకి వచ్చేసాడు. అయితే ఇక ఈ షోలో గౌతమ్ చెప్పిన ఒక మాట విని హౌస్ లో గౌతం ఓ కంటెస్టెంట్ తో ప్రేమలో పడ్డాడు అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది.
అదేంటి హౌస్ లో గౌతమ్ ఎవరితో ప్రేమలో పడ్డాడు. ఎక్కడ కనిపించటం లేదే అంటారా.. అయితే గతంలో ఎలిమినేట్ అయిన శుభశ్రీ రాయగురుతో గౌతమ్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది గౌతమ్ వన్ పాయింట్ ఓ లో శుభశ్రీ నీకు బాగా నచ్చింది అంటూ యాంకర్ గా ఉన్న గీతూ డైరెక్ట్ గానే చెప్పేస్తే... తెగ సిగ్గు పడిపోయాడు గౌతం. బయటకు వెళ్లిన తర్వాత ముందు తనను కలవాలి. తనతో అయితే మాట్లాడతా అంటూ గౌతం చెప్పాడు. దీంతో గౌతమ్ శుభశ్రీ తో ప్రేమలో పడిపోయినట్టున్నాడే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.