తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమా లలో నటించి అందులో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను అందుకుని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. 

ఇకపోతే కార్తీ తాజాగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందిన జపాన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అను ఇమన్యూయల్ హీరోయిన్ గా నటించింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా డిసెంబర్ 11 వ తేదీ నుండి ఈ సినిమాని తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: