తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీ తో నటుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈయన తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన నితిన్ అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగించ గలుగుతున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ నటుడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. రావు రమేష్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 8 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర , సీడెడ్ , కర్ణాటక ఏరియా థియేటర్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఆంధ్ర హక్కులను 9 కోట్లకు ... సీడెడ్ హక్కులను మూడు కోట్లకు ... కర్ణాటక హక్కులను 1.26 కోట్ల కు ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని నైజాం లో ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఓన్ గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటున్న చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: