బిగ్ బాస్.. కేవలం తెలుగులోనే కాదు హిందీలో సూపర్ సక్సెస్ అయ్యి తమిళ, కన్నడ భాషల్లో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా మనందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీలను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా పంపించి బిగ్బాస్ నిర్వాహకులు ఆడించే గేమ్స్ అటు బుల్లితెర ప్రేక్షకులు అందరిని కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ షోలో ఆడ మగ అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూడటం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. తినడానికి పడుకోవడానికి సరైన వసతులు కల్పిస్తూ ఇక కంటెస్టెంట్స్ తో టాస్కులు ఆడిస్తూ ఉంటారు నిర్వాహకులు.


 అయితే బిగ్ బాస్ హౌస్ లో స్నేహాలు ప్రేమాయణాలు కొత్తేమి  కాదు. ఇక తెలుగులో అయితే ఉండవు కానీ అటు హిందీ బిగ్ బాస్ లో ప్రేమాయణాలు మాత్రమే కాదు డీప్ రొమాన్స్ లు కూడా హౌస్ లో కనిపిస్తూ ఉంటాయి.  కెమెరాలు తమని చూస్తున్నాయని ఇక ఇదంతా టీవీలో టెలికాస్ట్ అవుతుంది అనే భావన లేకుండా ఎంతో మంది కంటెస్టెంట్స్ హిందీ బిగ్ బాస్ లో రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వరకు తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి రొమాన్స్ లు జరగలేదు అని చెప్పాలి. ఎందుకంటే నాలుగు గదుల మధ్య చేసుకునే దాన్ని పబ్లిక్ గా చూపించడానికి మనవాళ్లు కాస్త ఇష్టపడరు.


 కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు పాటు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి కోరికలు కలిగే ఛాన్స్ మాత్రం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో కంటెస్టెంట్లు ఏం చేస్తారు అనే అనుమానం ఎంతో మంది ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే ఇదే విషయంపై బిగ్ బాస్ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకొని ఎలిమినేట్ అయిన సందీప్ మాస్టర్ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ నూ పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగా అలాంటి సుఖం ఎప్పుడు అనుభవించని వారు అంటే అలాంటి ఆలోచనలు ఉండవు. కానీ మీకు పెళ్లయింది. అందమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాలా కాలం పాటు భార్యకు దూరంగా ఉన్నారు. అప్పుడు ఫీలింగ్స్ వస్తే ఏం చేసేవారు అని అడగగా ఇప్పుడు వరకు ఇలాంటి ప్రశ్న ఎవరు అడగలేదు అంటూ సందీప్ మాస్టర్ చెప్పాడు.


 అయితే చాలామందికి దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఈరోజు క్లారిటీ ఇచ్చే అవకాశం నాకు వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. తామంతా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అక్కడ ఉన్న వాతావరణం కి అలాంటి కోరికలు కలగవు అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి అక్కడ ఉంటే ఒత్తిడి టెన్షన్ వల్ల అసలు ఇదొక అవసరం ఉంటుందనే విషయం కూడా మర్చిపోతామని.. ఒకవేళ నా భార్య బిగ్ బాస్ హౌస్ లో నాతో పాటు ఉన్న కంట్రోల్లో లేకపోతే బయట జనాలు ఏమనుకుంటారో అనే భయం ఎప్పటికీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రొమాంటిక్ బాయ్స్ బిగ్ బాస్ లోకి వెళ్లిన అమలక్కల్లా మారిపోతారని.. అలాంటి ముచ్చట్లు పెడుతుంటారని చెప్పుకొచ్చాడు సందీప్ మాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: