
ఇక బెల్లంకొండ సురేష్ తన కుమారుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే వివి వినాయక్ దర్శకత్వంలో తన కుమారుడిని ఇండస్ట్రీకి అల్లుడు శీను అనే సినిమా ద్వారా పరిచయం చేశారు. ఇక ఈ సినిమాల్లో సమంత హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటికే స్టార్ హీరోల సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత ఇలా కొత్త హీరో పక్కన నటించడం అంటే నిజంగానే సాహసం అని చెప్పాలి. మొదట్లో ఈ హీరోతో నటించడానికి సమంత కూడా కాస్త ఆలోచన చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సమయంలోనే ఈమె బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రభస సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక సమంత సాయి శ్రీనివాస్ పక్కన నటించడానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తనకు అప్పట్లో ఆరు కోట్ల రూపాయల విలువ చేసే ఒక బంగ్లాను సమంతకు రెమ్యూనరేషన్ కింద ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇక ఈయన ఇలాంటి భారీ ఆఫర్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితులలో సమంత కూడా అల్లుడు శీను సినిమాలో సాయి శ్రీనివాస్ కి జోడిగా నటించారని తెలుస్తోంది. ఇలా కొడుకు కోసం సమంతకు బెల్లంకొండ సురేష్ భారీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఎన్టీఆర్ సమంత కాంబినేషన్లో వచ్చిన రభస సినిమా డిజాస్టర్ గా నిలవగా అల్లుడు శీను సినిమా పరవాలేదు అనిపించుకుంది. మొత్తానికి ఈ రెండు సినిమాల ద్వారా నిర్మాతకు ఏ విధమైనటువంటి లాభాలు కూడా లేవని తెలుస్తుంది. ఇలా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా అల్లుడు శీను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు అక్కడ కూడా చత్రపతి సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టినటువంటి ఈయనకు పెద్దగా సక్సెస్ అందలేదని తెలుస్తుంది. మరోవైపు సమంత మాత్రం స్టార్ హీరోయిన్గా సినిమాలు వెబ్ సిరీస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.