డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ హీరోగా, రష్మిక హీరోయిన్గా జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ రేంజ్ లో భారీ హిట్ అందించిన సినిమా ఇదేనని చెప్పవచ్చు. బాలీవుడ్లో ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకుంది.. ఒకపక్క ఫాదర్ ఎమోషనల్ సన్నివేశాలతో కట్టిపడేశారు చిత్ర బృందం. మరొకపక్క బోల్డ్ సన్నివేశాలతో మాస్ యాక్షన్ సీక్వెల్స్ తో కూడా డైరెక్టర్ అదరగొట్టేసారని చెప్పవచ్చు.


ఇప్పటికె ఈ సినిమా నుంచి కేవలం ఐదు రోజులలో 500 కోట్ల రూపాయల కలెక్షన్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రణబీర్ కెరియర్ లోనే బ్లాక్బస్టర్ విజయం గా నిలిచిన ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్లను రాబడుతోంది. యానిమల్ సినిమాలోని ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా మంచి పేరు తెచ్చేలా చేసిందని చెప్పవచ్చు. యానిమల్ సినిమా విడుదలైన అన్నిచోట్ల కూడా అన్ని భాషలలో మంచి పాజిటివ్ రివ్యూలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ యానిమల్ సినిమాని పొగిడేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.


తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనిమల్ సినిమాను చూసి తన రివ్యూ ని సైతం సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. మొత్తానికి నిన్ననే యానిమల్ సినిమా చూశాను నిస్సందేహంగా ఈ సినిమాతో ప్రేమలో పడ్డాను ఈ సినిమా బలహీనమైన గుండె ఉన్న వాళ్ళు కు మాత్రమే కాదు దీంట్లో చాలా బ్లడీ యాక్షన్స్ అన్ని వేశాలు కూడా ఉన్నాయి.. మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందాలి అంటే కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లో చూడడం ఎవరు మిస్ కాకండి అంటూ రష్మిక ఫోటోను షేర్ చేయడం జరిగింది రేణు దేశాయ్.. ఇలా మొదటిసారి యానిమల్ సినిమాని పొగిడేస్తూ పోస్ట్ చేయడంతో ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: