మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా నటుడిగా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేర్ వీరయ్య ... భోళా శంకర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో వాల్టేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించగా ... భోళా శంకర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

 ఇది ఇలా ఉంటే చిరంజీవి ఇప్పటికే మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే ఓ మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ని యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో చిరంజీవి కూడా జాయిన్ కాబోతున్నాడు. ఇకపోతే తాజాగా చిరంజీవి మరో బ్యానర్ లో ఓ మూవీ ని ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయన మెగాస్టార్ చిరంజీవి తో ఒక మూవీ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు అందులో భాగంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ ని తెరకెక్కించడానికి ఇప్పటికే ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే చిరంజీవి కి ఓ కథను వినిపించగా ఆయన కూడా దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: