రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ సినిమా రోజుకో రికార్డును సునాయసంగా బ్లాస్ట్ చేస్తోంది. ఇంతకుముందు బాలీవుడ్లో ఎప్పుడో లేనంత బజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ మూవీ రణబీర్ కపూర్ కెరీర్ లోనే సంజు సినిమాని దాటి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుని సంజు రికార్డు ను బ్రేక్ చేసింది.అసలు ఈ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. దర్శకుడు సందీప్ రెడ్డివంగా మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంచనాలకు మించి సినిమా ఉంటుంది అని చెప్పాడు.ఇక తెలుగు హిందీ ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ తో సినిమా చూసిన తర్వాత బయటికి వస్తున్నారు. కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా సినిమాపై అవేమీ అంతగా ప్రభావం కూడా చూపలేదు.ఇక బాక్సాఫీస్ వద్ద  రోజుకు ఒక రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తోంది. ఈ ఇయర్ లో ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కూడా ఇది రెండవ స్థానంలో నిలిచింది.కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా యానిమల్ సినిమా మంచి కలెక్షన్స్  రాబడుతోంది.


 ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే ఈ సినిమా ఏకంగా 10 మిలియన్లకు పైగా డాలర్లను అందుకొని టాప్ 7 మూవీస్ లో ఒకటిగా నిలిచింది.యానిమల్ సినిమా రెండవ శుక్రవారం కూడా బెస్ట్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఈ సంవత్సరం ఏడు రోజుల తర్వాత కూడా రెండవ శుక్రవారం గద్దర్ సినిమా 20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకోగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన మూవీగా యానిమల్ సినిమా నిలిచింది.నిన్న శుక్రవారం నాడు కూడా ఈ సినిమాకు 25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. పోటీగా ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం ఈ మూవీకి బాగా కలిసి వచ్చింది. చూస్తూ ఉంటే ఈ వీకెండ్ కూడా యానిమల్ మరొక రికార్డును అందుకునే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా చూసి రామ్ గోపాల్ వర్మ ఇంకా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు.ఇక ప్రభాస్ తో సందీప్ చేస్తున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో యానిమల్ మూవీతో పాపులర్ అయిన తృప్తి దింరి ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: