తాజాగా ఐకాన్ అల్లు అర్జున్ యానిమల్ మూవీ చూసి టీమ్ మొత్తాన్ని పేరుపేరునా అభినందించాడు. ఇదిలా ఉంటే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్లుగా వచ్చిన రాజమౌళి, మహేష్ బాబుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగాని రాంగోపాల్ వర్మతో పోలుస్తూ స్పీచ్ ఇచ్చిన రాజమౌళి యానిమల్ మూవీ గురించి ఒక్క  పోస్ట్  కూడా చేయలేదు. మరోవైపు చిన్న సినిమాలు నచ్చితే ప్రత్యేకంగా పోస్ట్   చేసే మహేష్ బాబు కూడా యానిమల్ విషయంలో సైలెంట్ గా ఉన్నాడు.

 అసలు ఈ ఇద్దరూ యానిమల్ మూవీని చూడలేదా? చూసినా నచ్చలేదా? అనేది మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరికీ యానిమల్ సినిమా నచ్చలేదేమో, అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కనీసం ఈ వీకెండ్ లో అయినా సినిమా చూసి రాజమౌళి, మహేష్ పోస్ట్   చేస్తారేమో చూడాలి. మరోవైపు యానిమల్ మూవీని పొగిడిన వాళ్ళు ఎంతమంది ఉంటే విమర్శించిన వాళ్ళు అంతమంది ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కబీర్ సింగ్ విషయంలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి.

కానీ సందీప్ రెడ్డి వంగా ఆ కామెంట్స్ ని ఏ మాత్రం లెక్క చేయడం లేదు. సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నా కలెక్షన్స్ ఎక్కడా తగ్గడం లేదు. మొదటి వీకెండ్ లోనే రూ.550 కోట్ల గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన ఈ మూవీ రెండో వీకెండ్ ముగిసే సరికి రూ.1000 కోట్ల మార్క్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ వీకెండ్ పూర్తవకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లోనూ మంచి ఆక్యుపెన్సి మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది. సినిమాలో రణ్ బీర్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: