సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా చూసేందుకు కొంతమంది చిన్నారులతో కలిసి సమంత హైదరాబాదులోని ప్రముఖ థియేటర్ కి వచ్చింది. దాంతో థియేటర్ వద్ద సమంత ను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరి కేరింతలు కొట్టడం మొదలుపెట్టారు. దాంతో సమంత తన ఫ్యాన్స్ అందరికీ నవ్వుతూ అభివాదం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సమంత సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. 

వైట్ కలర్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకుని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. థియేటర్ దగ్గర సమంతను చూసిన ఫ్యాన్స్ చాలామంది ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో సమంత కొత్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ వాళ్లందర్నీ దాటుకుని థియేటర్ లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం మీద చిన్నారులతో కలిసి సమంత నాని హాయ్ నాన్న మూవీని చూసేందుకు ఇలా థియేటర్ కి రావడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా దీని కంటే ముందు సమంతస్కూల్ కి వెళ్లి చిన్నారులతో సందడి చేసిన విషయం తెలిసిందే. చిన్నారులతో సరదాగా గడిపిన ఫొటోలను సమంత తన 

సోషల్ మీడియాలో షేర్ చేయగా వాటిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా ఇదే పోస్టులో గతంలో తను వ్యాయామం చేస్తున్న వీడియోలను సైతం పంచుకుంటూ..‘ఏడాది క్రితం ఇలా ప్రారంభించానని తెలిపింది సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే, చివరగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో విజయ్ - సమంత కెమిస్ట్రీ, సాంగ్స్ కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత సమంత 'సిటాడేల్' అనే వెబ్ సిరీస్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: