తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా నా సామి రంగ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఆశకా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ , రాజ్ తరుణ్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాని ప్రస్తుతం ఈ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: