మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొంత కాలం లోనే ఉప్పెన మూవీ దర్శకుడు అయినటువంటి బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే విలువడింది. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా తెరకెక్కనున్న నేపథ్యంలో ఈ మూవీ ని "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు కొంత మంది కాస్ట్ అండ్ క్రూ ను సెట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు మరియు టెక్నికల్ విభాగాల్లో ఎవరు పనిచేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ తండ్రి అయినటువంటి బోనీ కాపూర్ ఇప్పటికే ధ్రువీకరించాడు. అలాగే ఈ మూవీ లో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఈ అనే స్వయంగా తెలియజేశాడు. ఇక ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అలాగే రత్నవేలు ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. ఈ మూవీ యూనిట్ ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. కొల్లా అవినాష్మూవీ కి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేయనున్నాడు. ఇలా ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు కొంత మంది కాస్ట్ అండ్ క్రూ ను సెలెక్ట్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rc