యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇలా నితిన్ కి దెబ్బ మీద దెబ్బలు పడుతున్నాయి.గతంలో నితిన్ కి పదేళ్ల పాటు హిట్ లేదు. ఆ సమయంలో నితిన్ కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరీ అంత డేంజర్ జోన్ లో నితిన్ లేడు కానీ ఇలా ఫ్లాపులు కంటిన్యూ అయితే మార్కెట్ పై ఎఫెక్ట్ ఉంటుంది. దీనిని అడ్డుకోవాలంటే నితిన్ కి వెంటనే ఒక హిట్ మూవీ అవసరం. ప్రస్తుతం నితిన్ వరుస చిత్రాల్లో క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో నితిన్.. తనకి భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాబిన్ హుడ్ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఏఈ రెండు సెట్స్ పై ఉండగానే నితిన్ మరో చిత్రం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్ లో నితిన్ కొత్త చిత్రానికి సైన్ చేసినట్లు తెలుస్తోంది. హను మాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ నిర్మించిన ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నితిన్ తో భారీ బడ్జెట్ చిత్రం రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ కి కెరీర్ కి తిరిగి ప్రాణవాయువు పోసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు అట. అంటే ఇష్క్ కాంబినేషన్ దాదాపు 12 ఏళ్ళ తర్వాత రిపీట్ కాబోతోంది. నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. వైవిధ్యమైన కథలకు విక్రమ్ కుమార్ కేరాఫ్ అడ్రెస్. ఈ చిత్రాన్ని కూడా విక్రమ్ ఆసక్తికర సబ్జెక్టు తో తీర్చిదిద్దబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: