ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల టైమ్ టేబుల్ ను విడుదల చేయకముందే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక ఎప్పుడు అయితే ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల టైమ్ టేబుల్ ను ప్రకటించిందో అప్పటి నుండి ఈ ప్రాంతంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపే విధంగా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం అధికార పార్టీ అయినటువంటి వైసిపి ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తూ ఉంటే ... టిడిపి , జనసేన , బిజెపి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. 

ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ బలమైన పార్టీ అయినటువంటి టిడిపి ఎక్కువ సీట్లను తీసుకోగా ... ఆ తర్వాత జనసేన ... ఆ తర్వాత బిజెపి ఎక్కువ సీట్లను దక్కించుకుంది. ఇకపోతే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే జనసేన పార్టీ కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఈ సారి చాలా బలమైన పార్టీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దానితో ఈ పార్టీలోకి చేరికలు కూడా భారీగానే జరుగుతున్నాయి.

అందులో భాగంగా వంగవీటి రాధా కూడా జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన ఈ పార్టీలో జాయిన్ కావడానికి సంబంధించిన దాదాపు పనులు అన్ని పూర్తి అయినట్లు అధికారిక ప్రకటన ఆలస్యం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈయనకు సంబంధించి రెండు ప్రాంతాల టికెట్ లను కూడా జనసేన పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాధా కు మచిలీ పట్నం ఎంపీ టికెట్ లేదా అవని గడ్డ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.

పొత్తులో భాగంగా మచిలీ పట్నం, అవని గడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేన తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సీట్లలో ఏదో ఒకటి రాధా కు ఇవ్వాలని జనసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కొన్ని రోజుల క్రితం బాలశౌరి , నాదెండ్ల మనోహర్‌ తో రాధా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాత ఈయన జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్న వార్తలు బయటకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: