తెలుగు సినీ పరిశ్రమలో చాలా క్యాలిక్యులేటర్ గా సినిమాలను నిర్మించే నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఏదైనా సినిమాను నిర్మించాలి అంటే మొదటగా కథను పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాతే అందుకు హీరోలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంత సెలెక్టివ్ గా వెళతాడు కాబట్టే ఈయన ఇప్పటి వరకు నిర్మించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా దిల్ రాజు ... విజయ్ దేవరకొండ హీరో గా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను నిర్మించాడు.

మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలలో భాగంగా ఈ మూవీ బృందం ఓ చిన్న పాటి ఈవెంట్ ను నిర్వహించింది. అందులో ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు కూడా పాల్గొన్నాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు "ఫ్యామిలీ స్టార్" మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ ... ఫ్యామిలీ స్టార్ మూవీ మాస్ , క్లాస్ , యూత్ మరియు ఫ్యామిలీస్ అందరూ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఇది వరకు ఈ రకం పాత్రలో విజయ్ ఎప్పుడు నటించలేదు. ఈ మూవీ లోని ఆయన నటనను అందరూ ఇష్ట పడతా.రు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇలా ఈ మూవీ గురించి దిల్ రాజు ఫుల్ పాజిటివ్ గా చెప్పడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: